Darshan Thoogudeepa: స్టార్ హీరోపై కేసు నమోదు చేసిన పోలీసులు !

స్టార్ హీరోపై కేసు నమోదు చేసిన పోలీసులు !

Darshan Thoogudeepa: కన్నడ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ హీరోకు కేరాఫ్ అడ్రస్ నటుడు దర్శన్ తూగుదీప్(Darshan Thoogudeepa). తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఈ శాండల్ వుడ్ స్టార్ కు అలవాటు. గతంలో గృహ హింస చట్టం క్రింద ఇతని భార్య ఫిర్యాదు చేయడం, ఓ హోటల్ లో వెయిటర్ పై దాడిచేయడం, నిర్మాతను మోసం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా వన్య ప్రాణులను పెంచడం ఇలా గతంలో దర్శన్ పై చాలా కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు దర్శన్… సూపర్ హిట్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్‌వుడ్‌ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్… సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శన్ తో పాటు పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Darshan Thoogudeepa – అసలేం జరిగిందంటే ?

న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా వీరు పార్టీని కొనసాగించారు. సెలబ్రెటీలంతా కేక్‌లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనితో నిబంధనలకు విరుద్ధంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హీరో దర్శన్‌తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్‌లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్‌ఐఆర్‌పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు.

Also Read : Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్ !

Darshan ThoogudeepaKatera
Comments (0)
Add Comment