Darshan Thoogudeepa: మర్డర్ కేసులో సినిమా కష్టాలు అనుభవిస్తున్న కన్నడ హీరో !

మర్డర్ కేసులో సినిమా కష్టాలు అనుభవిస్తున్న కన్నడ హీరో !

Darshan Thoogudeepa: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపిటన్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ ను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్ర ద్వారా రేణు స్వామిని చంపడానికి దర్శన్‌(Darshan Thoogudeepa) ప్లాన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో బెంగుళూరు సమీపంలో ఓ ప్రైవేటు హోటల్ లో ఉన్న దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం దర్శన్, అతని ప్రియురాలు పవిత్రగౌడను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకష్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది.

Darshan Thoogudeepa..

హత్య కేసులో హీరో దర్శన్‌ ని రెండవ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్‌లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్‌ ప్రకారం ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

చిత్రదుర్గ్‌ దర్శన్‌(Darshan Thoogudeepa) ఫ్యాన్‌ క్లబ్‌ కన్వీనర్‌ రాఘవేంద్ర(రఘు) ఇందులో ప్రధాన సూత్రధారి వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్‌, రేణుకా స్వామిని బెల్ట్‌, కర్రలతో బాది… గొడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి, ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్‌ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్‌లో మాట్లాడిన కాల్‌ రికార్డులు ఆధారంగా మారాయి.

దర్శన్‌ మంగళవారం రాత్రి కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌లో నిద్రలేని రాత్రి గడిపాడు. పండ్ల జ్యూస్, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేలుకునే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిరియాని ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిరియాని ఆరగించారు. పోలీసులు 6 రోజులపాటు కస్టడీకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. దర్శన్‌ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు. సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్‌(Darshan Thoogudeepa) ఠాణాలో దిగులుగా కూర్చున్నారు. ఒక్క సిగరెట్‌ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్‌ లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్‌ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదేపదే చెబుతున్నాడని తెలిసింది.

రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్‌(Darshan Thoogudeepa) బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్ట్‌ చేశారు.

మరోవైపు నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా బుధవారం నాడు చిత్ర దుర్గ ప్రజల ధర్నాలతో అట్టుడికింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు చేరి దర్శన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్‌ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అనేక మంచి పాత్రలు చేసిన దర్శన్‌(Darshan Thoogudeepa) నిజ జీవితంలో విలన్‌ గా మారడం విషాదనీయమన్నారు. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సింది అని, ఇలా అమానుషంగా హత్య చేయడం సబబు కాదన్నారు. ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.

తన పుత్రున్ని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. గత శనివారం బెంగళూరులో హత్యకు గురైన చిత్రదుర్గవాసి రేణుకాస్వామి కుటుంబీకులు ఘోరాన్ని తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిత్రదుర్గలో బుధవారం కుటుంబ సభ్యులు,బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్‌ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు.

Also Read : Vijay Sethupathi: 50 సినిమాల కోసం 500 కథలు విన్న విజయ్ సేతుపతి !

Banglore PoliceDarshan Thoogudeepa
Comments (0)
Add Comment