Daniel Balaji: కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (48) మృతి చెందారు. అర్థరాత్రి ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని…. కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు దృవీకరించారు. డేనియల్ బాలాజీ ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించాడు. సౌత్ ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించిన డేనియల్… తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విడుదలకు నోచుకోని కమల్ హాసన్ సినిమా ‘మరుదనాయగం’ సెట్స్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Daniel Balaji No More..
బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ సీరియల్ ‘చితి’… అక్కడ అతను ‘డేనియల్(Daniel Balaji)’ అనే పాత్రను పోషించాడు. ‘పిన్ని’ పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్‌గా అయ్యింది. ఈ సీరియల్ హిట్ అయిన తర్వాత… అతని రెండవ సీరియల్ ‘అలైగల్’లో దర్శకుడు సుందర్ K. విజయన్, ‘చితి’లో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి ‘డేనియల్ బాలాజీ’ అని పేరు పెట్టారు. దీనితో అప్పటి నుండి డేనియల్ బాలాజీగా గుర్తింపు పొందారు.
డేనియల్ బాలాజీకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి… కాగా తల్లి తమిళ్ కుటుంబానికి చెందిన వారు. డైరెక్టర్ కావాలని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్‌మీనన్ తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది. గద్దలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అథర్వ మురళితో బంధుత్వం ఉంది. డేనియల్ అమ్మగారి నుంచి అథర్వతో బంధుత్వం ఉంది.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ 10వ సినిమా ‘VS10’ అనౌన్స్ చేసిన మేకర్స్