Daggubati Venkatesh: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీఅనిల్ 13 (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58 చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ షూట్ లోకి విక్టరీ వెంకటేష్(Daggubati Venkatesh) జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ ను ఎక్స్-కాప్ గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. వెంకటేష్, అనిల్ రావిపూడి సెట్ లో సరదాగా గడిపిన సమయాన్ని వీడియో ప్రజెంట్ చేస్తోంది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో టాకీ పార్ట్స్, సాంగ్స్ షూటింగ్‌పై టీమ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
Daggubati Venkatesh Movie Updates
ఈ సినిమా కాన్సెఫ్ట్ విషయానికి వస్తే.. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇన్-ఫార్మ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్, తమ్మిరాజు ఎడిటింగ్.. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్, వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమాపై విక్టరీ వెంకటేష్(Daggubati Venkatesh), ఆయన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే, ఇంతకు ముందు వెంకీ 75వ చిత్రంగా వచ్చిన ‘సైంధవ్’ చిత్రం అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. పవర్ ఫుల్ టైటిల్, తారాగణంతో ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే బ్లాక్‌బస్టర్ మెషిన్ గా పేరున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ కచ్చితంగా వారి కాంబినేషన్‌లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో ‘F2’, ‘F3’ సినిమాలు వచ్చాయి.
Also Read : Mahesh Babu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ !