Daggubati Rana: సైలంట్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన రానా తమ్ముడు అభిరామ్

సైలంట్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన రానా తమ్ముడు అభిరామ్

Daggubati Rana: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానిది ప్రత్యేకమైన స్థానం. శతాధిక చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గుబాటి రామానాయుడు. డి రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన దగ్గుబాటి వెంటకేష్… హీరోగా సుస్థిత స్థానం సంపాదించుకోగా… మరో కుమారుడు సురేష్ బాబు… ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు.

Daggubati Rana – తాత, బాబాయ్ బాటలో దగ్గుబాటి వారసులు

డి రామానాయుడు పెద్ద మనుమడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన దగ్గుబాటి రానా(Daggubati Rana)… టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో డి రామానాయుడు చిన్న మనుమడు, రానా తమ్ముడు అభిరామ్… ఇటీవల ప్రముఖ దర్శకుడు తేజ దర్వకత్వంలో ‘అహింస’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అభిరామ్ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం తన సమీప బంధువు ప్రత్యుషను పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంకలో ఉన్నాడు. డిసెంబరు 6న జరగబోయే వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

తేజ దర్శకత్వంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభిరామ్

అయితే తేజ దర్శకత్వంలో దాదాపు రెండేళ్ళ పాటు తెరకెక్కిన ఈ ‘అహింస’ సినిమా ఈ ఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదల అయింది. ఆ తరువాత సెప్టెంబరు నెలలో ఈ సినిమాను టీవీల్లో కూడా టెలికాస్ట్ చేసారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయి దాదాపు ఆరు నెలలు దాటిన తరువాత ఈ సినిమా సడన్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమయింది.

ఇటీవల విడుదల అయిన తెలుగు సినిమాలు… ఓటీటీలో రావడానికి 30 నుండి 60 రోజుల సమయం పడుతుంది. అయితే ‘అహింస’ సినిమాకు మాత్రం సుమారు ఆరు నెలలు సమయం పట్టగా… అభిరామ్ పెళ్ళి పీటలు ఎక్కుతున్న సమయంలో ఓటీటీలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.

ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన సినిమా ‘అహింస’. దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని, రజత్‌ బేడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 2 విడుదలైంది.

Also Read : Hero Vishal: జీసీసీ అధికారులపై హీరో విశాల్‌ సంచలన వ్యాఖ్యలు

daggubati abhiramDaggubati Rana
Comments (0)
Add Comment