Daggubati Rana: టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ఏ ముహూర్తాన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి చేసుకున్నారో గాని… యంగ్ హీరో,హీరోయిన్లు వరుసగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఇటీవల రంగం ఫేం కార్తీక నాయర్, బిగ్ బాస్ ఫేం మానస్, దండుపాళ్యం ఫేం పూజా గాంధీలు పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారు అవ్వగా… తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు, రౌడీ బాయ్స్ ఫేం ఆశిష్ రెడ్డి… నిశ్చితార్ధం చేసుకుని త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నాడు.
తాజాగా మరో తెలుగు హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ ఇప్పుడు పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమయ్యాడు. సురేష్ బాబు కుటుంబానికి సమీప బంధువు, వరుసకు మరదలు అయ్యే ప్రత్యూష మెడలో మూడు ముళ్ళు వేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసాడు.
దివంగత నిర్మాత డి రామానాయుడు స్వగ్రామం కారంచేడుకు చెందిన ఈమె… అభిరామ్ తో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యింది. వీరి పెళ్ళి బంధువులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుల మధ్య డిసెంబరు 6 ఘనంగా నిర్వహించడానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
Daggubati Rana – శ్రీలంక వేదికగా డిసెంబరు 6న డెస్టినేషన్ వెడ్డింగ్
అభిరామ్, ప్రత్యూషల పెళ్ళి ఎవరు ఊహించని విధంగా మూడు రోజుల పాటు శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అతికొద్దిమంది మాత్రమే హాజరు కానున్న ఈ పెళ్లి వేడుక… సోమవారం రాత్రి డిన్నర్ పార్టీతో మొదలవుతుంది. మంగళవారం.. మెహందీ, డిన్నర్ ఉంటుంది. బుధవారం.. పెళ్లి కూతుర్ని చేయడం, అదే రోజు రాత్రి 8:50 గంటలకు అభిరామ్.. ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయనున్నట్లు సమాచారం.
‘అహింస’తో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చిన అభిరామ్
నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి రానా(Daggubati Rana) ఇప్పటికే నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా… రెండో అబ్బాయి అభిరామ్ కూడా ‘అహింస’ అనే సినిమాతో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
కోవిడ్ సమయంలో రాణాకు మిహికబజాజ్ తో పెళ్లి అవ్వగా… ఇప్పుడు అభిరామ్ పెళ్లికి రెడీ అయిపోయాడు. గతంలో ప్రేమ పెళ్ళి పేరుతో అభిరామ్ తనను వాడుకుని వదిలేశాడంటూ… వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆమెకు కోట్లలో పరిహారం ముట్టజెప్పడంతో ఆమె సైలంట్ అయిపోయింది.
Also Read : Varun Tej: ఫారిన్ వెకేషన్ లో వరుణ్-లావణ్య