Daggubati Family Invites : అమ్మమ్మ గారి ఇంట్లో అక్కినేని కొత్త పెళ్ళికొడుకు

అక్కినేని నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీ‌కి జన్మించిన కుమారుడు అక్కినేని నాగచైతన్య...

Daggubati Family : బుధవారం అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్‌ విగ్రహం సమీపంలోనే వీరి వివాహం జరిగింది. వివాహానంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన ఆనందం వ్యక్తం చేసిన నాగార్జున తన తండ్రి ఏయన్నార్‌ విగ్రహం దగ్గర తమ కుటుంబ సభ్యులందరూ కలసి దిగిన ఫొటోని గురువారం షేర్‌ చేశారు. నాగచైతన్య మదర్ ఫ్యామిలీ, అదే దగ్గుబాటి ఫ్యామిలీ(Daggubati Family) నాగ చైతన్యను పెళ్లి కొడుకును చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Daggubati Family Invites Naga Chaitanya..

అక్కినేని నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీ‌కి జన్మించిన కుమారుడు అక్కినేని నాగచైతన్య. దగ్గుబాటి లక్ష్మీ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె అనే విషయం తెలిసిందే. నాగచైతన్య(Naga Chaitanya)ను తన మదర్ లక్ష్మీ దగ్గరుండి మరీ పెళ్లి కొడుకును చేశారు. అలాగే మామయ్యలు దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరూ దగ్గరుండి మరీ రెడీ చేయడం విశేషం. వారికి చైతూ ముద్దుల మేనల్లుడు. వెంకీ, చైతూ కలిసి ‘వెంకీ మామ’ అనే సినిమా కూడా చేశారు. ఇక తన మేనల్లుడి పెళ్లి నిమిత్తం వెంకటేష్ దగ్గరుండి మరీ దిష్టి చుక్క పెడుతుండటం విశేషం. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈఫొటోలనే కాదు.. దగ్గుబాటి ఫ్యామిలీకి సోదరసోదరీమణులు సురేష్ బాబు, వెంకటేష్, లక్ష్మీ కలిసి చైతూతో దిగిన ఫొటో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంకా దగ్గుబాటి రానా మరో స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ గ్రూప్ ఫొటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక చైతూ, శోభిల పెళ్లి అనంతరం వారిద్దరి నాగార్జున వెంటబెట్టుకుని శ్రీశైలం టెంపుల్‌కి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి పెళ్లి నిమిత్తం మీడియాకు, స్నేహితులకు, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ నాగ్ థ్యాంక్స్ చెప్పారు. నా కుమారుడి పెళ్లి కేవలం కుటుంబ వేడుకే కాదు.. మీ అందరి వల్ల అది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమైంది. అక్కినేని కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నాగ్ పేర్కొన్నారు.

Also Read : Kanguva OTT : సూర్య ఫాంటసీ యాక్షన్ సినిమా ‘కంగువా’ ఇక ఓటీటీలో

Akkineni Naga ChaitanyamarriageRana DaggubatiTrendingUpdatesViral
Comments (0)
Add Comment