DaarKaari MM Part 2 : పార్ట్ 1 లేకుండానే పార్ట్ 2 గా వస్తున్న క్రేజీ ఫిల్మ్ ‘దార్కారి’

పాన్ మసాలా చిత్రమంటూ ఇప్పటికే వదిలిన ప్రీ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది...

DaarKaari MM Part 2 : డిఫరెంట్ కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లో తన ముద్రను వేస్తోంది. కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఎప్పుడూ ముందుంటున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫుల్ బిజీగా ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ అప్డేట్ విషయానికి వస్తే..

DaarKaari MM Part 2 Movie Updates

‘టిల్లు స్క్వేర్’ సినిమాకు రైటర్‌గా, ‘మ్యాడ్’ చిత్రంలో ఓ కీ రోల్ పోషించి మెప్పించిన రవి ఆంథోని ఇప్పుడు డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా రవి ఆంథోని కొత్త చిత్రానికి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ నటుడిగా తన పంథాని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ బబుల్ గమ్’ సినిమాలో తన నటనతో చైతు జొన్నలగడ్డ అందరినీ మెప్పించారు. తన సోదరుడు సిద్దు బాటలోనే చైతు కూడా నడుస్తున్నారు. నటనతో పాటు చైతు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని కూడా అందిస్తున్నారు. రవి ఆంథోని దర్శకత్వం.. చైతు జొన్నలగడ్డ రైటింగ్‌తో.. ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో రాబోతోన్న ‘ధార్కారి #MM పార్ట్ 2(DaarKaari MM Part 2)’అనే చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ మసాలా చిత్రమంటూ ఇప్పటికే వదిలిన ప్రీ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది. హీరో ఎవరు? అనేది రివీల్ చేయకుండా.. డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ మెప్పిస్తోంది. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో హీరో గోల్డ్ మెన్‌గా ఫుల్ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ ధార్కారి #MM పార్ట్ 2(DaarKaari MM Part 2)’ అంటూ ఈ పోస్టర్ మీద కనిపిస్తుండటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే, అసలు పార్ట్ వన్ అనేది లేకుండా.. ఇలా రెండో పార్ట్‌ను ప్రకటించడం.. అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

Also Read : Committee Kurrollu : మహామహుల ప్రశంసలు అందుకుంటున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

New MoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment