Daaku Maharaaj : బాబీ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ , శ్రద్దా శ్రీనాథ్ , ఊర్వశి రౌటేలా కలిసి నటించిన డాకు మహారాజ్(Daaku Maharaaj) చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనిని రూ. 100 కోట్లు పెట్టి తీస్తే రూ. 150 కోట్ల దాకా రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాలు దిల్ రాజు నిర్మించనవే కాగా మరోటి డాకు మహారాజ్.
Daaku Maharaaj Movie OTT Updates
ఇంకో రెండు రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన వెంకటేశ్ , మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం . వీటిలో డాకు మహారాజ్ సక్సెస్ కాగా సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
డాకు మహారాజ్ జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో హిందీ వెర్షన్ జనవరి 24న రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా నెట్ ఫ్లిక్స్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో డాకు మహారాజ్ చిత్రాన్ని ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్గ చేస్తున్నామని ప్రకటించింది. ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు సంతోషంగా ఉండవచ్చని తెలిపింది.
బాలకృష్ణ ఎక్కువగా ప్రచారం కోసం పని చేయడు. సినిమాలను చేసుకుంటూ పోతాడంతే.
Also Read : Hero Allu Arjun-Hollywood Magazine :హాలీవుడ్ మ్యాగజైన్ లో బన్నీ కవర్ ఫోటో