Curry and Cyanide: ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా వాస్తవ పరిస్థితులను, నిజ జీవిత సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించే సాధనం డాక్యుమెంటరీ. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పోలిస్తే డాక్యుమెంటరీలకు కాస్త ఆదరణ తక్కువ ఉంటుందనే చెప్పుకోవాలి. ఏంతో ప్రముఖ, ప్రసిద్ధమైన వ్యక్తులు, ఘటనలు, ప్రదేశాలు తప్ప సాధారణ ఘటనలను ఆధారంగా తెరకెక్కించే డాక్యుమెంటరీలను ఆదరించడంలో సినీ ప్రియులు ముఖ్యంగా యువత కాస్తా వెనుక బడ్డారనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ‘కర్రీ అండ్ సైనైడ్(Curry and Cyanide)’ అనే డాక్యుమెంటరీ మాత్రం భాషతో సంబంధం లేకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. కేరళలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో ఈ ‘కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్’ రూపొందింది. క్రిస్టో టామీ దీనికి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ డాక్యుమెంటరీ టాప్-10 స్ట్రీమింగ్ కంటెంట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
Curry and Cyanide – ‘కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్’ కథేమిటంటే ?
కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్ జాలీ జోసెఫ్‌కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్‌ను ఆహారంలో సైనైడ్ పెట్టి చంపేసింది. తాను మరో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని స్నేహితురాలు, ఆమె కూతురుకి సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. ఆరుగురిని హత్య చేసినా పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత జాలీ ఆడపడుచు ధైర్యం చేసి, పోలీసులకు చెప్పడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. గంటన్నర నిడివి గల ‘కర్రీ అండ్ సైనైడ్’ టాప్ 10లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Janhvi Kapoor: సినిమా వాళ్ళతో నో డేటింగ్ అంటోన్న జాన్వీ కపూర్