Dhanashree Verma : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఆ క్రికెటర్ భార్య

ఆ పాత్ర నచ్చిన ధనశ్రీ నటించేందుకు అంగీకరించిందట...
Dhanashree Verma : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఆ క్రికెటర్ భార్య

Dhanashree Verma : ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్, ఆర్సీబీ మాజీ క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ ఒక తెలుగు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ(Dhanashree Verma) ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా పాపులర్. అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో, ధన్‌శ్రీ తన డ్యాన్స్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది. ధనశ్రీ కొన్ని డ్యాన్స్ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. ఇప్పుడు తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. డ్యాన్స్ ప్రధాన కథాంశంతో రూపొందుతున్నఈ సినిమాలో ధనశ్రీ కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ యష్ హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికుమార్ ముత్తులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ధనశ్రీ ఇప్పటికే ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Dhanashree Verma Movie Updates

ఇక ఈ సినిమాలో కథానాయిక కోసం భరతనాట్యం నుంచి ఆధునిక నృత్యం వరకు వివిధ రకాల నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న నటి కోసం చిత్ర బృందం వెతికారట. చాలా ఆడిషన్స్ తర్వాత ధనశ్రీని అడిగారట. ఆ పాత్ర నచ్చిన ధనశ్రీ నటించేందుకు అంగీకరించిందట. ఈ సినిమాలోని కొన్ని భాగాలను ముంబైలో చిత్రీకరించారు. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. సినిమాలో ధనశ్రీతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. మరో ఫీమేల్ లీడ్ కోసం సీరత్ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి కూడా కనిపించనుందని సమాచారం.

Also Read : Actor Ali : అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారంటూ ఆలీకి నోటీసులు

Dhanushree VermaMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment