Vijay Deverakonda : భారత దేశంలో సినీ రంగానికి , క్రీడా రంగానికి మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుంది. ప్రధానంగా క్రికెట్ ఆట పట్ల ఎక్కువగా మక్కువ పెంచుకున్నారు నటులతో పాటు ఇతర టెక్నీషియన్లు. ఇక తాజాగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ మధ్యన తన ఆట తీరుతో దుమ్ము రేపుతున్నాడు. పరుగుల వరద పాటిస్తున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Vijay Deverakonda Selfie with..
అతికొద్ది కాలంలోనే స్టార్ గా పేరు పొందాడు తిలక్ వర్మ. ఇక టాలీవుడ్ కు సంబంధించి తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు పొందాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ఇక ఈ ఇద్దరు అనుకోకుండా ఒకే విమానంలో ప్రయాణం చేశారు.
తిలక్ వర్మ వెంటనే హీరో విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లాడు. ఆప్యాయంగా పలకరించాడు. రౌడీ బాయ్ తో సెల్పీ దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తనే ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
డియర్ ఫ్రెంట్ మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది..మిత్రమా మళ్లీ కలుసుకుందాం అంటూ ఇన్ స్టా గ్రామ్ లో తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల వరకు వస్తే తను ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తినన్నూరి తో వీడి12 అనే సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు.
Also Read : Kumbhasthalam Movie Effective : ఆకట్టుకుంటున్న కుంభ స్థలం పోస్టర్