Sreesanth: టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం నిషేదం ఎదుర్కొన్న క్రికెటర్ శాంతకుమారన్ శ్రీశాంత్. కేరళ స్పీడ్ స్టార్ గా టీమిండియాలో మంచి గుర్తింపు పొందిన శ్రీశాంత్… ఆది నుండి వివాదస్పద వైఖరితో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. 2011లో అనూహ్యంగా ఐపిఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి… అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వతంగా దూరమయ్యాడు. అయితే క్రికెట్ కు దూరమైన శ్రీశాంత్(Sreesanth)… నటుడిగా తనలోని ప్రతిభను వెలికితీస్తున్నాడు. 2015 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాల్లో నటించిన శ్రీశాంత… 2019లో కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన ‘కెంపేగౌడ 2’ సినిమాతో బెస్ట్ విలన్ గా అవార్డుని కూడా అందుకున్నారు. క్రికెట్ మైదానం నుండి వెండితెరపైకి వచ్చిన శ్రీశాంత్… మార్చి 23న విడుదల కాబోతున్న ‘యమధీర’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Sreesanth As A Vilan
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, భారత క్రికెటర్ శ్రీశాంత్ విలన్ పాత్రలో నటించిన సినిమా ‘యమధీర’. వేదాల శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్‌గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించారాని ఆయన అన్నారు. దీనితో క్రికెట్ మైదానంలో శ్రీశాంత్ ను చూసిన అభిమానులు వెండితెరపై విలన్ పాత్రలో చూడటానికి ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : RRR: తగ్గని ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ క్రేజ్ ! ఒక్క నిమిషంలో థియేటర్ హౌస్ ఫుల్ !