The Raja saab : ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్(The Raja Saab)’ . మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్థి కుమార్ హీరోయిన్లు. హారర్, కామెడీ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ క్రేజి అప్డేట్ అందించారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. అందరు అనుకున్నట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
The Raja saab Movie Updates
ఇక పోస్టర్ విషయానికి వస్తే డార్లింగ్ ప్రభాస్ ‘సిగార్ బీడీ’ తాగుతూ క్రేజి గెటప్‌లో ఒక రాజ్ మహల్‌లో కుర్చీపై కూర్చొని ఉన్నాడు. దీంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయనుండగా.. చిత్రీకరణ తుది దశలో ఉంది. మరోవైపు ప్రభాస్ మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, రాజాసాబ్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడితో ఓ చిత్రం ఉన్నాయి. ఒక్కో షూటింగ్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌లలో బిజీబిజీగా గడుపుతున్నారు.
Also Read : Venom The Last Dance : ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న హాలీవుడ్ సినిమా