Court Movie Sensational :కలెక్షన్లలో హాఫ్ సెంచరీ దాటేసిన కోర్ట్

సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసిన మూవీ

Court : నూత‌న ద‌ర్శ‌కుడు రామ్ జ‌గ‌దీశ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ న‌టుడు నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం కోర్ట్(Court) దుమ్ము రేపుతోంది. విడుద‌లైన ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదైల‌న చిత్రాల‌లో ఈ మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. స్టార్ హీరోల‌కు ధీటుగా ముందుకు సాగుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌సు చూర‌గొంది. కేవ‌లం ఒకే ఒక చ‌ట్టంను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ ఆక‌ట్టుకునేలా తీయ‌డంలో , డిఫ‌రెంట్ గా క‌థ‌ను చెప్ప‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.

Court Movie Collections Sensation

అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో కోర్ట్ ను తెర కెక్కించాడు రామ్ జ‌గ‌దీశ్. చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సినిమా కోసం క‌థ‌ను రాసుకునేందుకు మూడు సంవ‌త్స‌రాలు ప‌ట్టింద‌న్నాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని చెప్పాడు. ప్ర‌త్యేకించి ప్రియ‌ద‌ర్శి , హ‌ర్ష‌వ‌ర్ద‌న్ , ఇత‌ర న‌టీ న‌టుల న‌ట‌న బాగుంద‌న్నాడు. శివాజీ పాత్ర హైలెట్ అని పేర్కొన్నాడు. ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు డైరెక్ట‌ర్.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా కోర్ట్ హాఫ్ సెంచ‌రీ దాటేసింది. ఏకంగా రూ. 50 కోట్లు వ‌సూలు చేసింద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డం విశేషం. హ‌త్తుకునే క‌థ‌, న‌టీ న‌టుల స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న‌, వెర‌సి చిత్రీక‌ర‌ణ మొత్తం కోర్ట్ ను ఓ రేంజ్ లో నిలిపేలా చేసింది. మొత్తంగా క‌థ‌ను ఎంచుకున్నందుకు ద‌ర్శ‌కుడిని, తీసేలా చేసినందుకు నానిని అభినందించ‌కుండా ఉండ‌లేం. విచిత్రం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ ఏకంగా కోర్ట్ ను రూ. 8 కోట్ల‌కు తీసుకోవ‌డం.

Also Read : Anchor Shyamala- Shocking :బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామ‌ల విచార‌ణ

CinemaCollectionsCourtTrendingUpdates
Comments (0)
Add Comment