Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్(Yash) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఈ ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది.
Toxic Movie Updates
టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. టాక్సిక్(Toxic) సినిమా సెట్ ను అటవీ భూమిలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారని న్యాయవాది జి.బాలాజీ పిల్ దాఖలు చేశారు. వెంటనే సెట్ ను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిల్‌కు సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు, హెచ్‌ఎంటిలకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది జి. బాలాజీ పిటీషన్ లో పేర్కొన్నదాని ప్రకారం అటవి ప్రాంతానికి సమీపంలోని 20 ఎకరాల స్థలం (అటవీ భూమి)లో అనధికారికంగా టాక్సిక్ సెట్ ను నిర్మించారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ సెట్‌ను వెంటనే క్లియర్ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ అంశంలో విచారణను ఆగష్టు 19కి కోర్టు వాయిదా వేసింది.
నోటీసుల అంశంపై టాక్సిక్ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ రియాక్ట్ అయ్యారు. సెట్ వేస్తున్న స్థలం తమ ఆత్మీయులదేనని ఆయన చెప్పారు. దీనితో కోర్టు నోటీసులు ఆఫీసుకి లేదా స్థలం యజమానికి వచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు. కెవిఎన్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ నుంచి టాక్సిక్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Also Read : Vijay Sethupathi: విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో !