Court : ప్రస్తుతం టాలీవుడ్ లో భిన్నమైన కథలు, చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. దీనిని గమనించిన నటుడు నాని నిర్మాతగా మారాడు. ఆపై డిఫరెంట్ స్టోరీస్ కు ప్రయారిటీ ఇస్తూ ఎంకరజ్ చేస్తున్నాడు. తన ఫ్యాక్టరీ నుంచి వచ్చిన చిత్రం కోర్ట్. ఇది ఇటీవలే విడుదలై అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వసూళ్ల వేట కొనసాగిస్తోంది. వీకెండ్ లో సైతం ఎక్కడా తగ్గడం లేదు కోర్ట్.
Court Movie Sensational Collections
ఈ సందర్బంగా మూవీ మేకర్స్ అధికారికంగా తమ చిత్రానికి సంబంధించిన వసూళ్ల రికార్డ్ ను ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఏకంగా సోమవారం నాటికి రూ. 28.9 కోట్లు సాధించిందని వెల్లడించారు. దీంతో కోర్ట్(Court) దర్శక, నిర్మాతలతో పాటు నాని, చిత్ర బృందం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తెగ సంతోషానికి లోనవుతోంది. పేరుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలకు ధీటుగా వసూలు చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇందులో ప్రధానంగా పోక్సో చట్టం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని కెలికాడు దర్శకుడు రామ్ జగదీశ్. ఇందులో సహజ నటనకు పేరు పొందిన ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. మిగతా తారాగణం కూడా తమకు ఇచ్చిన పాత్రలకు అంచనాలకు మించి న్యాయం చేశారు. దీంతో చివరకు కోర్ట్ రిజల్ట్ పాజిటివ్ గా వచ్చేసింది. అన్ని వర్గాల ప్రజలు దీనిని ఆదరిస్తున్నారు..రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డ్ లను తిరగ రాస్తుందనేది వేచి చూడాలి.
Also Read : Hero Rajinikanth Coolie :తలైవా కూలీ షూటింగ్ క్లోజ్