Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu)’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ లో భాగంగా ఆగస్టు 9న విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ట్రైలర్ ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. యువతను ఆకట్టుకోవడంతో పాటు వారిని ఆలోచించేలా ట్రైలర్ ఉంది.
Committee Kurrollu Movie Updates
ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ… ‘‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారికకు థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేదే ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఇంకో సినిమాకు ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్ తో తీసిన పెద్ద సినిమాలా అనిపిస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు యదు వంశీకి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక(Niharika) మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. పెద్ద హిట్ చేస్తారు. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది’’ అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ… ‘‘తనకు షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దుకి థాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. ‘కమిటీ కుర్రోళ్ళు’ అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’’ అని కోరారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ… ‘‘మా ఈవెంట్‌కు వచ్చిన హీరో సిద్దుకి థాంక్స్. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దుగారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా, నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. నిహారిక(Niharika), ఫణి వంటి నిర్మాతలు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా చూసేందుకు థియేటర్లోకి రానుంది. ఈ సినిమా అందరికీ మంచి ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది.’’ అని అన్నారు.
ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటులు కనిపించినా వారు నటించిన తీరు చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ట్రైలర్‌లో ఎక్కువగా స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ చక్కగా చూపించారు. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి ‘కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu)’ తప్పకుండా ఉంటారు అనేలా ట్రైలర్ ఉంది.
Also Read : Ajith Kumar: అజిత్, ప్రశాంత్ నీల్ సినిమాపై మేనేజర్ సురేష్ చంద్ర క్లారిటీ !