Committee Kurrollu: ఓటీటీలోనికి ‘కమిటీ కుర్రోళ్ళు’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఓటీటీలోనికి ‘కమిటీ కుర్రోళ్ళు’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌ పై తెరకెక్కించిన తాజా సినిమా ‘కమిటీ కుర్రోళ్లు(Committee Kurrollu)’. ఒకరిద్దరు మినహా కొత్త నటీనటులతో నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచి… భారీ విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా పలువురు ఈ చిత్ర యూనిట్ ను అభినందించారు.

గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘ఈటీవీ విన్‌’ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ‘‘కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu)’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అయితే విడుదల తేదీని మాత్రం ఖరారు చేయలేదు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Committee Kurrollu – ‘కమిటీ కుర్రోళ్లు’ క‌థేమిటంటే ?

గోదావ‌రి జిల్లాల్లోని ఓ మారుమూల ప‌ల్లెటూరు పురుషోత్తంప‌ల్లి. అక్క‌డ ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌కు… దానిలో భాగంగా చేసే బ‌లి చేట ఉత్స‌వానికి ఎంతో ప్రాశ‌స్త్యం ఉంటుంది. అయితే ఈసారి జాత‌ర జ‌రిగిన ప‌దిరోజుల‌కు ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గాల్సి ఉంటుంది. దీనితో ఈ ఎన్నిక‌ల్లో ఆ ఊరి ప్ర‌స్తుత స‌ర్పంచ్ బుజ్జి (సాయికుమార్‌)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. అయితే గ‌త జాత‌ర స‌మ‌యంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాత‌ర పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్ట‌కూడ‌ద‌ని పంచాయితీలో ఊరి పెద్ద‌లు తీర్పునిస్తారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది ? ఈసారి జాత‌ర ఎలా జ‌రిగింది ? ప‌న్నెండేళ్ల క్రితం కులాల గొడ‌వ వ‌ల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్క‌ట‌య్యింది ? ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచారు ? అన్న‌ది మిగిలిన క‌థ‌. ఈ కథను కామెడీ, సెంటిమెంట్ లను కలగలిపి గోదావరి యాసతో అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు యదు వంశీ.

Also Read : Mathu Vadalara 2: సింగర్‌ గా అవతారం ఎత్తిన జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా !

Committee KurrolluE Tv WinNiharika Konidela
Comments (0)
Add Comment