Committee Kurrollu OTT : ఓటీటీలో విహరిస్తున్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా

కథ విష‌యానికి వ‌స్తే.. పురుషోత్తంపల్లి.. గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల పల్లెటూరు...

Committee Kurrollu : ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాల‌ను త‌ట్టి లేప‌డంతో పాటు మంచి విజ‌యం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu)’ సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు. సుమారు పదకొండు మందికి పైగా కొత్త నటులను, న‌లుగురు హీరోయిన్స్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సాయికుమార్‌, గోపరాజు రమణ, సీనియర్‌ నటి శ్రీ లక్ష్మి, ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించింది.

Committee Kurrollu Movie OTT Updates

కథ విష‌యానికి వ‌స్తే.. పురుషోత్తంపల్లి.. గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల పల్లెటూరు. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే భరింకాళమ్మతల్లి జాతర, అక్క‌డ చేసే బ‌లి చేట ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈసారి జాతర స‌మ‌యంలోనే స‌ర్పంచ్ ఎన్నిక‌లు రావ‌డంతో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్‌ బుజ్జి (సాయి కుమార్‌)పై పోటీ చేసేందుకు ఆ ఊరికి చెందిన ఓ కుర్రాడున శివ (సందీప్‌ సరోజ్‌) ముందుకొస్తాడు. అయితే గతంలో జాతర సమయంలో కులం రిజర్వేషన్‌ కారణంగా జరిగిన గొడవలో 11 మంది స్నేహితుల్లో ఒక‌త‌ను ఆత్రం (నరసింహ) మరణిస్తాడు. దాంతో స్నేహితుల్లో కొందరు తలో దారికి వెళ్లిపోతారు. ఆ గొడ‌వ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయ‌కూడ‌దని పంచాయితీలో ఊరి పెద్దలు నిర్ణ‌యిస్తారు.

ఈ క్ర‌మంలో వారంతా ఏం చేశారు, స్నేహితులంతా జాతరలో కలిశారా? కులాలను అడ్డుపెట్టుకుని పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ప్రస్తుత ప్రెసిడెంట్‌ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్‌) పాత్ర ఏమిటి? ఈసారి జాతను 11 మంది కమిటీ కుర్రోళ్లు ఎలా చేశారు, ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నది మిగిలిన కథ. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబరు 12 గురువారం (ఈ రోజు) నుంచే ఈ టీవీ విన్ Ottలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, త‌మ బాల్యాన్ని మ‌రోసారి గుర్తు చేసుకోవాల‌నుకునే వారు ఈ మూవీనా ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్స‌వ‌కుండా ఇంటిల్లి పాది క‌లిసి ఇప్పుడే చూసేయండి.

Also Read : Janhvi-Kiara : టాలీవుడ్ లో ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆ బాలీవుడ్ భామలు

CinemaCommittee KurrolluOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment