Committee Kurrollu OTT : ఓటీటీకి సిద్దమవుతున్న 1990’s కిడ్స్ సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’

కాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసుకునేందుకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ముందుకు రాలేదట...

Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్లు. మొత్తం 11 మంది కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా నటించడం విశేషం. అలాగే నలుగురు కొత్త అమ్మాయిలు కొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. య‌దు వంశీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరిలో జరిగే ఓ జాతర, ఎన్నికలను నేపథ్యంగా తీసుకుని కమిటీ కుర్రోళ్లు సినిమాను తెరకెక్కించారు. 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లెల వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడంతో కమిటీ కుర్రోళ్లు(Committee Kurrollu) థియేటర్లకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.15.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ వంటి బడా హీరోల చిత్రాలు రిలీజైనప్పటికీ కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu) సినిమా థియేటర్లలో ఇంకా జోరు చూపిస్తోంది. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నిహారిక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో కమిటీ కుర్రోళ్లు సినిమా ఆహాలోకి అడుగు పెట్టవచ్చని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనుందట.

Committee Kurrollu Movie OTT Updates

కాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసుకునేందుకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ముందుకు రాలేదట. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‍లో నిర్మాత నిహారిక కొణిదెల స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం, భారీగా కలెక్షన్లు రావడంతో ఓటీటీ హక్కులకు డిమాండ్ డబుల్ అయిందని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని తదితరులు ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read : Sreelekha Mitra : మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న హింస పై స్పందించిన మరో నటి

CinemaCommittee KurrolluTrendingUpdatesViral
Comments (0)
Add Comment