Prudhvi Shocking :న‌న్ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారు

క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ ఆవేద‌న 

Prudhvi : 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ టాలీవుడ్ ను షేక్ చేసిన క‌మెడియ‌న్ పృథ్వీరాజ్(Prudhvi) భ‌యంతో వ‌ణికి పోతున్నాడు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకుంటున్నాడు. త‌న‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. గ‌త కొన్ని రోజుల నుంచి రెండు మూడు కార్లు త‌న ఇంటి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని, వారు ఎవ‌రో అర్థం కావ‌డం లేదంటూ పేర్కొన్నాడు.

Prudhvi Raj Shocking Comments

ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా త‌న మొబైల్ నంబ‌ర్ ను పోస్ట్ చేసిన వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. వారిపై రూ. కోటి ప‌రువు న‌ష్టం దావా వేశాన‌ని తెలిపాడు క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్. సోష‌ల్ మీడియా వేదిక‌గా పృథ్వీరాజ్ ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. తాను న‌టించిన లైలా మూవీకి సంబంధించి బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తించారు. చివ‌ర‌కు న‌టుడు విశ్వ‌క్ సేన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. దీనికంత‌టికీ కార‌ణం క‌మెడియనేనంటూ వాపోయాడు.

కాగా లైలా మూవీ ప్రీ ఈవెంట్ కార్య‌క్ర‌మంలో చిరంజీవితో పాటు పృథ్వీరాజ్ కూడా హాజ‌ర‌య్యాడు. వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి ఇన్ డైరెక్టుగా 11 గొర్రెలు మాత్ర‌మే మిగిలాయంటూ కామెంట్ చేశాడు. ఇది వైర‌ల్ గా మారింది. చివ‌ర‌కు బీపీ పెరిగి ఆస్ప‌త్రి పాల‌య్యాడు పృథ్వీరాజ్. ప్ర‌స్తుతం కంట్రోల్ లో ఉండ‌డంతో తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. లేపేస్తామంటున్నారంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు.

Also Read : Hero Vijay Kingdom Movie :విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్ డ‌మ్’ టీజ‌ర్

comedianCommentsPrudhvi RajShockingViral
Comments (0)
Add Comment