Comedy Genius Prudhvi :ఆస్ప‌త్రిలో చేరిన పృథ్వీ రాజ్

బీపీ పెర‌గ‌డంతో తీవ్ర ఇబ్బంది 

Prudhvi : హైద‌రాబాద్ – 30 ఏళ్ల ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. బీపీ పెర‌గ‌డంతో ఉన్న‌ట్టుండి కుప్ప కూలాడు. దీంతో హుటా హుటిన కుటుంబీకులు హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స ప్రారంభించారు. సినిమా షూటింగ్ లో ఉండ‌గా స‌డెన్ గా కింద ప‌డ్డార‌ని స‌మాచారం. దీంతో డాక్ట‌ర్లు పృథ్వీ రాజ్(Prudhvi) కు సెలైన్  ఏర్పాటు చేశారు.

Comedy Genius Prudhvi Health Update

అయ్యో క‌మెడియ‌న్ ఆస్ప‌త్రి పాలు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు. తాజాగా త‌ను ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. దీనికి కార‌ణం విశ్వ‌క్ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు పృథ్వీ రాజ్ కూడా పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. వైసీపీ నేత‌ల గురించి ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. వారిని మేక‌ల‌తో పోల్చారు. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. బాయ్ కాట్ లైలై పేరుతో హ్యాష్ ట్యాగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ల‌క్ష దాటింది. దీంతో విశ్వ‌క్ సేన్  సార్టీ చెప్పాడు. త‌న‌ను టార్గెట్ చేయ‌డంతో త‌ట్టుకోలేక పృథ్వీరాజ్ ఆస్ప‌త్రి పాలైన‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు త‌ను తొలిసారిగా కొత్త రంగుల ప్ర‌పంచం పేరుతో సినిమా తీస్తున్నాడు. ఈనెల 26న బిగ్ ఈవెంట్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Also Read : Indias Got Latent- Sensational :ఇండియాస్ గాట్ లాటెంట్ వీడియో తొల‌గింపు

Health ProblemsPrudhvi RajUpdatesViral
Comments (0)
Add Comment