తెలుగు సినిమా రంగంలో నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు కొదవ లేదు. టెక్నాలజీ మారింది. దాంతో పాటు సినిమా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమా ఛాన్స్ ల కోసం గతంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే గూగుల్ యూట్యూబ్ ను తీసుకు వచ్చిందో చెప్పాలంటే ఓ ఏడాది సమయం పడుతుంది.
షార్ట్ ఫిలింలు, డాక్యుమెంటరీస్, సాంగ్స్ ..ఇలా ప్రతి ఒక్కరికీ వేదికగా మారింది. ఈ తరుణంలో సినిమాకు ప్రయారిటీ తగ్గుతోంది. ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు వచ్చాక కొత్త వారికి ఎనలేని అవకాశాలు దక్కుతున్నాయి.
ఇప్పటి దాకా తామే గొప్ప వాళ్లమని, తమకు ఎదురే లేదని విర్రవీగుతూ ఉన్న వాళ్లకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు కమెడియన్ తెలంగాణకు చెందిన వేణు. దిల్ రాజు నిర్మించిన బలగం సినిమాను రూపొందించాడు. ఇది కమర్షియల్ సినిమాలను దాటేసింది. కలెక్షన్లు, అవార్డులను కొల్లగొట్టింది.
ఈ తరుణంలో మరో కమెడియన్ , నటుడు ధన్ రాజ్ కూడా కీలక ప్రకటన చేశాడు. ఆదివారం ట్వీట్ ద్వారా తను కూడా దర్శకుడిగా మారినట్లు ప్రకటించాడు. ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.