Comedian Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Comedian Bonda Mani: కోలీవుడ్‌ లో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి (60) గుండెపోటుతో హాఠాత్తుగా మృతి చెందారు. బోండా మణి పల్లవరం సమీపంలోని బొజిచలూరులోని తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోగా… కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బోండా మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు‌గా ధృవీకరించారు. దీనితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోండా మణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Comedian Bonda Mani No More

శ్రీలంకలో జన్మించిన బోండా మణి తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలతో మొదలెట్టి హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. భాగ్యరాజ్ హీరోగా 1991లో వచ్చిన ‘పౌను పౌనుటన్‌’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బోండా మణి(Bonda Mani).. ఆ తర్వాత ‘సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా’.. ఇలా దాదాపు 175కి పైగా చిత్రాలలో నటించారు. స్టార్ కమెడియన్ వడివేలుతో కలిసి ఆయన చేసిన వివిధ హాస్య సన్నివేశాలు ఎందరినో అలరించాయి. వాస్తవానికి బోండా మణి ఆరోగ్యం బాగాలేదంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బోండా మణికి డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవు అని పలు మీడియాల్లో వార్తలు రావడంతో… కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ఆయనకు సాయం చేశారు. దీనితో కిడ్నీ సంబంధిత వ్యాధి నుండి కోలుకున్న బోండా మణి సడెన్‌గా గుండె పోటుతో మరణించడంతో అంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

Also Read : Animal: ఒక్క కారణంతో… రూ. 40 కోట్లు నష్టపోయాం: ‘యానిమల్‌’ నిర్మాత

bonda manicomedian
Comments (0)
Add Comment