CM KCR : నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ కు కేసీఆర్ కంగ్రాట్స్

తెలుగు సినీ రంగానికి విశేషంగా స‌పోర్ట్

CM KCR : 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విలక్షణమైన రీతిలో తమ అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ కు సీఎం(CM KCR) కంగ్రాట్స్ తెలిపారు. ఇన్నేళ్ల‌లో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

CM KCR Congratulates to Award Winners

కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్య భరితమైన పాత్రల ద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అల్లు అర్జున్ అల‌రించార‌ని కొనియాడారు. త‌న నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందడం తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.

నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటి తరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సీఎం అన్నారు.

అదే సందర్భంలో తమ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

తెలుగు చలన చిత్ర రంగం ఇవాళ‌ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని సీఎం అన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. .

Also Read : Balakrishna : రామ్ న‌న్ను ఫాలో అవుతున్నాడు

cm kcr congratukate national award winners and allu arjuna chandrabose
Comments (0)
Add Comment