Chourya Paatam : ధమాకా, మజాకా చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు త్రినాథ రావు నక్కిన(Trinadha Rao Nakkina) ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఆ చిత్రమే చౌర్య పాఠం. మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. వచ్చే నెల ఏప్రిల్ 18న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. వినోదం, సస్పెన్స్, అదరగొట్టే డ్యాన్సులకు పెట్టింది పేరు దర్శకుడు త్రినాథరావు. సేమ్ అలాగే ఉండేలా చౌర్య పాఠం ఉండబోతోందని చెప్పకనే చెప్పారు.
Chourya Paatam Movie Updates
ఈ మూవీ ద్వారా ఇంద్ర రామ్ అనే యువ నటుడిని సినిమాకు పరిచయం చేయబోతున్నాడు. ఇందులో దోపిడీ చేసే బృందానికి నాయకుడిగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. గతంలో కార్తికేయ 2కి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నూతన దర్శకుడు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నక్కిన నేరేటివ్స్ బ్యానర్‌పై విడుదల చేస్తుండడం విశేషం. ఈ సినిమాకు వి చుడామణి సహ నిర్మాతగా ఉన్నారు.
కాగా చౌర్య పాఠం టీజర్ ను రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉందంటూ చూసిన వారు చెబుతున్నారు. ఇది నెట్టింట్లో సంచలనం రేపింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య విడుదల చేశారు. వచ్చే నెలలో విద్యార్థులకు సెలవులు ఉంటాయని, అందుకే అప్పుడే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు దర్శక, నిర్మాత త్రినాథరావు నక్కిన. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ కథానాయకిగా నటిస్తుండగా మిగతా పాత్రాలలో రాజీవ్ కనకాల, మస్త్ అలీ నటిస్తుండడం విశేషం.
Also Read : Hero Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్