Veera Dheera Sooran 2 : చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటించిన వీర ధీర సూర పార్ట్ -2(Veera Dheera Sooran 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా దర్శకుడు యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. చిన్నా చిత్రం ద్వారా పేరు పొందిన తమిళ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ అద్భుతంగా తీశాడు. గ్రామీణ నాటకంగా రూపొందించాడు. పార్ట్ -1 కంటే తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మరింత అంచనాలు పెంచేలా చేశాయి.
Veera Dheera Sooran 2 Movie Updates
కాళీ పాత్ర పోషించాడు విక్రమ్. ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతాడు. తన హింసాత్మక గతాన్ని విడిచి పెట్టాడు. ఇదే సమయంలో గ్రామ జాతర రాత్రి మాజీ బాస్ రవి పృథ్వీ తన సాయం కోరుతాడు. దీంతో విక్రమ్ గతం దెబ్బ తింటుంది. రవి కుమారుడు కన్నాను ఎస్పీ అరుణగిరి లక్ష్యంగా చేసుకుంటాడు. ఉద్రిక్తలు పెరిగే కొద్దీ కన్నాను రక్షించేందుకు తన పాత ఆయుధాలను తీసుకోవాలా వద్దా అనేది కాళీ నిర్ణయించు కోవాలి.
వీర ధీర సూర సీక్వెల్ మూవీలో చియాన్ విక్రమ్ శక్తివంతమైన నటనను ప్రదర్శించాడు. తన గతం, వర్తమానం మధ్య నలిగిపోతున్న వ్యక్తి పాత్రను అద్భుతంగా పోషించాడు. కాగా కాళి భార్యగా దుషార విజయన్ లీనమై పోయింది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలలో, భావోద్వేగ భరితమైన క్లైమాక్స్ రెండింటిలోనూ మెరిపించింది. ఎస్.జె. సూర్య తన సాధారణ విపరీతత్వాన్ని, సంయమనంతో కూడిన నటనను ప్రదర్శించాడు. 30 ఇయర్స్ పృథ్వీ ఊహించని రీతిలో పెద్దాయన పాత్రను పోషించడం విశేషం.
Also Read : Vijay Varma Shocking :సంబంధాలు ఐస్ క్రీం లాంటివి