Vikram: ‘చియాన్‌ 63’ కు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ !

‘చియాన్‌ 63’ కు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ !

Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. పా రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్‌’ తో ఆగస్టు 15 ప్రేక్షకులను పలకరించబోతున్న విక్రమ్… మరోవైపు ‘వీర ధీర శూరన్‌ పార్ట్‌ 2’ చిత్రీకరణను చకచకా పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడీ సినిమ పూర్తి చేసే లోపే ప్రేక్షకులకు మరో కొత్త కబురు వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. విక్రమ్‌ ప్రస్తుతం తన 63వ సినిమా కోసం కథల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు శాంతకుమార్‌ చెప్పిన స్క్రిప్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Vikram Movie Updates

‘మౌనగురు’, ‘మగముని’ చిత్రాలతో సినీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శాంత. ఆయన గతంలో విక్రమ్‌ నటించిన ‘దిల్‌’, ‘ధూల్‌’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఇప్పుడాయన విక్రమ్‌ కోసం ఓ వైవిధ్యభరితమైన కథాంశాన్ని సిద్ధం చేసినట్లు తెలిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ విషయమై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి విక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Raj Tarun: రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్ రిలీజ్ !

Chiyaan 63Thangalaanvikram
Comments (0)
Add Comment