Chitral Rangaswamy: రేణుకాస్వామిపై కన్నడ నటి సంచలన వ్యాఖ్యలు !

రేణుకాస్వామిపై కన్నడ నటి సంచలన వ్యాఖ్యలు !

Chitral Rangaswamy: కన్నడ పరిశ్రమలో సంచలనంగా మారిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతుంది. తన ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించడంతో… ఆగ్రహానికి గురైన కన్నడ హీరో దర్శన్… ప్రియురాలి ఒత్తిడితో అభిమాన సంఘం నాయకుడు సహాయంతో రేణుకాస్వామిని అత్యంత కిరాతకంగా హత్య చేసారు. అయితే ఈ కేసును చాలా చాకచక్యంగా ఛేదించిన కర్ణాటక పోలీసులు… దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 18 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో అందరూ దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడను తప్పుపడుతూ… రేణుకాస్వామి కుటుంబానికి మద్దత్తు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ నటి చిత్రల్ రంగస్వామి(Chitral Rangaswamy)… రేణుకాస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Chitral Rangaswamy Comment

అయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటూ కన్నడ నటి చిత్రల్‌ రంగస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ… ‘ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే ! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్‌లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్‌ స్టేషన్‌లోనూ తనపై కేసు నమోదైంది. అలాగే అతడు గౌతమ్‌ అనే ఫేక్‌ అకౌంట్‌తో చాలామందికి పనికిమాలిన మెసేజ్‌లు చేసేవాడు.

ఆ స్క్రీన్‌షాట్లను నేనిప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్‌ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసుంటే నేనైతే బ్లాక్‌ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే… నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ చేసిన లిస్టులో ఆల్‌రెడీ ఇతడి అకౌంట్‌ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను’ అని చిత్రల్‌ పేర్కొంది. కాగా చిత్రల్‌ రంగస్వామి బాడీ బిల్డర్‌. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లోనూ పాల్గొంది.

Also Read : Nivetha Thomas : టాలీవుడ్ బ్యూటీ ‘నివేతా’ పెళ్లి పీటలెక్కనుందా..?

Chitral RangaswamyDarshan ThoogudeepaPavitra Gowda
Comments (0)
Add Comment