Saranga Dariya: ‘సారంగదరియా’ నుండి చిత్ర ఇన్స్పిరేషనల్ సాంగ్ విడుదల !

‘సారంగదరియా’ నుండి చిత్ర ఇన్స్పిరేషనల్ సాంగ్ విడుదల !

Saranga Dariya: పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ‘అందుకోవా…’ అనే లిరికల్ సాంగ్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విలక్షణ నటుడు, హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా విడుదలైన ఈ పాటను ప్రముఖ సింగర్ కె.ఎస్. చిత్ర ఆలపించారు. ఈ సందర్భంగా సాంగ్‌ ను విడుదల చేసిన నవీన్ చంద్ర ‘సారంగదరియా’ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

Saranga Dariya Song Viral

ఇక ఈ పాట విషయానికి వస్తే… పాటను లెజెండ్రీ సింగర్ కె.ఎస్. చిత్ర ఆలపించారు. ఇదొక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా పాట ఉండగా… రాంబాబు గోశాల పాటకు సాహిత్యం అందించారు. పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. ‘‘మా ‘సారంగదరియా(Saranga Dariya)’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లెజెండ్రీ సింగర్ చిత్రగారు ఈ పాటను పాడటం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

చిత్ర దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి(పండు) మాట్లాడుతూ ‘‘ ‘సారంగదరియా’ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి చిత్రగారు పాడిన ‘అందుకోవా..’ పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

Also Read : Heeramandi: వచ్చేసింది హీరామండీ నవాబ్స్‌ ఫస్ట్ లుక్ !

KS ChitraSaranga Dariya
Comments (0)
Add Comment