Jai Hanuman: ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ లో చిరు, మహేశ్ ?

ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ లో చిరు, మహేశ్ ?

Jai Hanuman: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయోత్సాహంతో ప్రశాంత్‌ వర్మ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ‘జై హనుమాన్‌’ ను వేగవంతం చేస్తున్నారు. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి ?’అన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.

Jai Hanuman Movie Updates

అయితే ఇందులో హనుమంతుడు, రాముడి పాత్రలను ఎవరు పోషిస్తారు ? అన్న అంశంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ(Prasanth Varma) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హనుమాన్‌, రాముడి పాత్రలను ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

హనుమాన్ పాత్రలో మెగాస్టార్ ?

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) మాట్లాడుతూ… ‘‘జై హనుమాన్‌’ మూవీ స్కేల్‌ చాలా పెద్దది. స్టార్‌ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే బయట మనం చూసే హనుమాన్‌ లా ఆ పాత్ర ఉండదు. ఆంజనేయస్వామికి అష్ట సిద్ధులు తెలుసు. కాబట్టి ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. హనుమాన్‌ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్‌ నటులు ఆసక్తి చూపారు. అయితే, ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవిగారు కూడా ఉండవచ్చు. చిరంజీవిగారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. చెప్పలేం’’ అని అన్నారు. దీనితో ‘జై హనుమాన్‌’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

రాముని పాత్రలో మహేశ్ ?

ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్‌బాబు. సోషల్‌ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్‌ చేసిన ఫొటోలను చూశా. మా ఆఫీస్‌ లో కూడా మేం రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్‌ చేసి చూసుకున్నాం. రాముడి పాత్రలో మహేశ్ బాబు ముఖం చాలా బాగా వచ్చిందన్నారు. దీనితో ‘జై హనుమాన్‌’ లో మహేశ్ బాబు నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Also Read : HanuMan Updates : హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపించిన వెంకయ్య నాయుడు

Megastar ChiranjeeviSuper Star Mahesh Babu
Comments (0)
Add Comment