Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను కుర్రకారుతో పోటీ పడుతున్నారు. వరుస మూవీస్ తో కెవ్వు కేక అనిపించేలా చేస్తున్నారు. అటు షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో వైపు వీలు కుదిరినప్పుడల్లా ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. పలు సినిమాలను, నటీ నటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తున్నారు. తను మొదటి నుంచి ఎక్కడ టాలెంట్ ఉంటే వారిని వెన్నుతట్టి మద్దతు ఇవ్వడం తన నైజం. అందుకే ఆయన ఇమేజ్ ఎవరూ అందుకోలేనంత దూరంలో ఉంది. ఇటీవలే అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.
Vishwambhara-Megastar Special Song
తాజాగా చిరంజీవి గురించిన ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కళ్యాణ్ రామ్ తో తీసిన బింబిసార సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు వశిష్ట ఇప్పుడు మెగాస్టార్ తో విశ్వంభర పేరుతో మూవీ తీస్తున్నాడు. ఇది ఆఖరి స్టేజ్ లో ఉంది. సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. అయితే మెగాస్టార్ కు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ పాడబోతున్నారని, ప్రముఖ సినీ గేయ రచయిత తనను దృష్టిలో పెట్టుకుని పాట కూడా రాస్తున్నట్లు టాక్. గతంలో ఎన్నో చిత్రాలలో మెగాస్టార్ తన గొంతుతో పాటలు పాడి అలరించారు. ఆ మధ్యన ఛాయ్ మీద పాడిన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక సినిమా విషయానికి వస్తే విశ్వంభర(Vishwambhara) కు సంబంధించిన పోస్టర్స్ , టీజర్ కు మంచి స్పందన లభించింది ప్రేక్షకుల నుంచి . త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇక మెగాస్టార్ గనుక సాంగ్ పాడితే సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. తమ అభిమాన నాయకుడు పాడాలని కోరుతున్నారు. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కు ముందుస్తుగా కంగ్రాట్స్ తెలియ చేస్తున్నారు.