Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈసారి జరుపుకుంటున్న జన్మదిన వేడుక పవన్‌కు ఎంతో ప్రత్యేకమైనది. అయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌కి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. పవన్‌లాంటి నాయకుడు ఏపీ ప్రజలకు కావాలని చిరు పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణిస్తూ.. అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Chiranjeevi Wishes
చిరు తన ఎక్స్ పోస్ట్‌లో “కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!” అని పోస్ట్ చేశారు. పవన్, చిరు కలిసి ఉన్న పాత ఫొటోను ఆయన తన పోస్ట్‌కి జత చేశారు.
Also Read : Pawan Kalyan : నిజమైన సినీ రాజకీయ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు