Chiranjeevi Congrats : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వ్యక్తం అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందాన కలిసి నటించిన పుష్ప ది రైజ్ చిత్రం దుమ్ము రేపింది. దేశ వ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టింది.
Chiranjeevi Congrats to Allu Arjun
రికార్డుల మోత మోగించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని అద్భుతంగా తెర కెక్కించాడు డైరెక్టర్ సుకుమార్. టేకింగ్, మేకింగ్ లో తనదైన స్పెషాలిటీ చూపించాడు. ఇక చంద్రబోస్ రాసిన పాటలు, మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తమ వంతు తోడ్పాటు అందించారు పుష్ప సక్సెస్ లో.
ప్రత్యేకించి బోస్ రాసిన ఊ అంటావా మావా అన్న సాంగ్ ఇండియాను ఊపేసింది. ఇదిలా ఉండగా తన మాస్ డైలాగులతో హోరెత్తించాడు అల్లు అర్జున్. తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అవార్డులను ప్రకటించింది. పుష్ప చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను బన్నీకి ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది.
ఈ సందర్బంగా అల్లు అర్జున్ కు సీఎం కేసీఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మేనత్త సురేఖ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన నివాసంలో బన్నీకి స్వీటు తినిపించారు.
Also Read : Jalier Collections : రూ. 600 కోట్ల క్లబ్ లోకి జైలర్