Chiranjeevi : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటికి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్‌ను కలవడానికి బయలుదేరారు. కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోనున్నారు. అయితే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చిక్కడపల్లికి బయలుదేరిన చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్దించారు. దాంతో చిరంజీవి(Chiranjeevi), సురేఖ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.
Chiranjeevi Visit
పుష్ఫ-2రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్‌పై రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇండస్ట్రీలో కూడా కదలిక మొదలైంది. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన చిక్కడపల్లి పీఎస్‌కు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తమ్ముడు అల్లు శిరీష్, నిర్మాత దిల్ రాజు వంటి వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మరి కొందరు సెలబ్రిటీలు సైతం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : Nayanthara : నా తప్పు లేనప్పుడు అవతలి వారు ఎంతటివారైనా భయపడను