Allu Arjun: అల్లు అర్జున్‌ కు మెగాస్టార్ స్పెషల్ విషెస్ !

అల్లు అర్జున్‌ కు మెగాస్టార్ స్పెషల్ విషెస్ !

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆర్మీతో పాటు మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా పలు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు బర్త్ డే బాయ్ బన్నీకు విషెస్‌ చెబుతున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా యూనిట్ ‘పుష్ప2’ టీజర్‌ ను విడుదల చేసి… సోషల్‌ మీడియాలో మిలియన్ల వ్యూస్‌ తో సందడి చేస్తోంది. దీనితో బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్ చిరంజీవి… ఈ టీజర్‌ అద్భుతంగా ఉందని… పుష్పరాజ్‌ రూల్‌ చేస్తాడన్నారు. ఈ పోస్ట్‌ కు రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్‌.. ‘థ్యాంక్యూ సో మచ్‌.

టీజర్‌ను మీరు ప్రశంసించడం ఆనందాన్నిచ్చింది. ఎంతో థ్రిల్‌గా ఉంది’ అని రాసుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్(Allu Arjun) కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన నుండి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. దీనితో అల్లు అర్జున్ కు సెలబ్రెటీలు చెప్పిన విషెస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Allu Arjun – సెలబ్రెటీల నుండి బన్నీకు శుభాకాంక్షల వెల్లువ !

అలాగే, పుష్పరాజ్‌ కు శుభాకాంక్షలు అంటూ ఇప్పటివరకు ఎవరూ చూడని అల్లు అర్జున్‌ స్టిల్‌ ఫొటోను షేర్‌ చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నావు. ఈ ఏడాది నీకు రెట్టింపు సంతోషాన్నివ్వాలని కోరుకుంటున్నా – సాయి ధరమ్‌ తేజ్

‘పుష్ప2’ టీజర్‌ వావ్‌ అనిపించేలా ఉంది. సుకుమార్‌కు మాత్రమే ఇలా తీయడం సాధ్యం. బన్నీ దానికి మరింత పవర్‌ను ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌ – నాని

ఐకాన్‌ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రత్యేకతతో స్క్రీన్‌పై అద్భుతాలు చేయండి – దర్శకుడు వశిష్ఠ

మీ శ్రద్ధ, నిబద్ధతతో పాటు.. మీ యాక్టింగ్‌ మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మీ అసాధారణ ప్రతిభతో జాతీయ అవార్డును సొంతం చేసుకుని మేమంతా గర్వపడేలా చేశారు. ఈ ఏడాదంతా మరిన్ని విజయాలు వరించాలి. ‘పుష్ప2’ టీజర్‌ అదిరిపోయింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా – దర్శకుడు శ్రీను వైట్ల.

నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా – రకుల్‌ ప్రీత్ సింగ్‌.

Also Read : Hanu Raghavapudi: ప్రభాస్‌ తో ఛాన్స్ కొట్టేసిన ‘సీతారామం’ దర్శకుడు !

allu arjunAllu Arjun ArmyMegastar Chiranjeevi
Comments (0)
Add Comment