Hero Chiranjeevi Mother :అమ్మ ఆరోగ్యం ప‌దిలం – చిరంజీవి

పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని విన్న‌పం

Chiranjeevi : త‌న త‌ల్లి అనారోగ్యానికి గ‌రైంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). తన‌ను ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించామంటూ వ‌చ్చిన వార్తలు పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా మీడియా, డిజిట‌ల్ మీడియాకు ఆయ‌న ప్ర‌త్యేకంగా విన్న‌వించారు ఎక్స్ వేదిక‌గా. ఈ సంద‌ర్బంగా ట్వీట్ చేస్తూ త‌న త‌ల్లి అంజ‌నా దేవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Chiranjeevi Mother Health Updates

త‌మ‌తో క‌లిసి ఆనందంగా ఉన్నార‌ని, ఆమెకు తామ‌న్నా, త‌మ కుటుంబం అన్నా ఎంతో అభిమాన‌మ‌ని పేర్కొన్నారు. కొంద‌రు ఎలాంటి ధ్రువీక‌ర‌ణ చేసుకోకుండా అత్యుత్సాహంతో వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం వ‌ల్ల మెగా ఫ్యామిలీకి చెందిన ల‌క్ష‌లాది మంది అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని, మీ అవ‌గాహ‌న‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు.

ఒక‌వేళ ఏదైనా జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగితే తామే ముందుగా మీడియాకు తెలియ చేస్తామ‌ని, అంత వ‌ర‌కు కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని విన్న‌వించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదిలా ఉండ‌గా చిరంజీవి త‌న త‌ల్లి అంజ‌నాదేవి ఆరోగ్యం గురించి బాగుంద‌ని చెప్ప‌డంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త‌మ అభిమాన న‌టుడు న‌మ్ముకున్న ఆంజ‌నేయుడు క‌రుణించాడ‌ని వారు పేర్కొంటున్నారు.

Also Read : Beauty Urvashi Rautela :డైమండ్ దీదీనా మ‌జాకా

ChiranjeeviUpdatesViral
Comments (0)
Add Comment