Hero Chiranjeevi : మెగాస్టార్ కు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం

ప్ర‌క‌టించిన యుకె పార్ల‌మెంట్

Chiranjeevi : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పుర‌స్కారం ల‌భించింది. యుకె పార్ల‌మెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ విషయాన్ని పార్ల‌మెంట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా మెగాస్టార్ యూకెకు ప‌య‌న‌మ‌వుతున్నారు. త‌న సినీ కెరీర్ లో అరుదైన ఘ‌న‌త ఇది అని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు చిరంజీవి. ఈ అవార్డును మార్చి 19న యునైటెడ్ కింగ్ డ‌మ్ పార్ల‌మెంట్ సాక్షిగా మెగాస్టార్ అందుకోనున్నారు.

Chiranjeevi Got Award

ఈ పుర‌స్కారాన్ని చిరంజీవి(Chiranjeevi) త‌న జీవితంలో సాంస్కృతిక ప‌రంగా స‌మాజానికి చేసిన అసాధార‌ణ కృషికి గాను ఎంపిక చేసిన‌ట్లు యుకె పార్ల‌మెంట్ స్ప‌ష్టం చేసింది. హౌస్ ఆఫ్ కామ‌న్స్ లో ఈ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు మెగాస్టార్. కాగా యుకె లోని స్టాఫోర్డ్ నుండి అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా ఈ కార్య‌క్ర‌మానికి ఆతిథ్యం ఇవ్వ‌నుండ‌డం విశేషం.

ఈ పుర‌స్కార కార్య‌క్ర‌మానికి సోజ‌న్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మ‌న్ స‌హా , ఇత‌ర ఎంపీలు కూడా హాజ‌రు కానున్నారు. ఈ గుర్తింపు భార‌తీయ సినిమాపై చిరంజీవి చూపిన ప్ర‌భావం, దాతృత్వ ప్ర‌య‌త్నాల‌కు నిద‌ర్శ‌నం అని చెప్ప‌క త‌ప్ప‌దు. బ్రిడ్జ్ ఇండియా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌క‌టించింది. తమ పని ద్వారా శాశ్వత సామాజిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఈ సంస్థ గుర్తిస్తుంది.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2024 సంవ‌త్స‌రంలో కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న‌త పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. పద్మ విభూష‌ణ్ తో స‌త్క‌రించింది. గిన్నిస్ వ‌రల్డ్ రికార్డ్ ను కూడా అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ప్ర‌క‌టించింది.

Also Read : Chourya Paatam Sensational :ఏప్రిల్ 18న చౌర్య పాఠం రిలీజ్

AwardsChiranjeeviTrendingUpdates
Comments (0)
Add Comment