Chiranjeevi-KCR: కేసీఆర్‌ని పరామర్శించిన మెగాస్టార్

కేసీఆర్‌ని పరామర్శించిన మెగాస్టార్

Chiranjeevi: తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఫామ్ హౌస్ లో ప్రమాదశాత్తు జారిపడిన కేసిఆర్ కు తుంటి ఎముక ఫ్యాక్చర్ కావడంతో… హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యశోద వైద్యులు… కేసిఆర్ కు హిప్ రీ ప్లేస్మెంట్ సర్జరీ చేసారు. సర్జరీ అయిన తరువాత తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి, ఏపి మాజీ సిఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)… సోమవారం రాత్రి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసిఆర్ ను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవిని, కేసిఆర్ వారసులు కేటిఆర్, కవిత దగ్గరుండి ఐసియూలోనికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేసిఆర్ తో పాటు యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన మెగాస్టార్… కేసిఆర్ కు అందుతున్న చికిత్స గురించి ఆరా తీసారు.

Chiranjeevi met KCR at Yasodha Hospital

కేసిఆర్ ను పరామర్శించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ…. కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నార‌ని త్వ‌ర‌లోనే దైనందిన జీవితంలోకి వ‌స్తారని తెలిపారు. స‌ర్జ‌రీ చేసిన‌ 24 గంటల్లోనే కేసిఆర్ ను న‌డిపించిన యశోద డాక్ట‌ర్ల కృషి అభినంద‌నీమయ‌మ‌న్నారు. కేసీఆర్‌ సినీ ఇండ‌స్ట్రీ గురించి కూడా అడిగార‌ని అంతా బావుంద‌ని చెప్పాన‌న్నారు. డాక్ట‌ర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పార‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గవంతున్ని ప్రార్ధిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదిలాఉండ‌గా మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఆరోగ్యంపైనే కాకుండా ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తుండ‌డంతో ఇండస్ట్రీకి పెద్దన్న అంటూ అభిమానులు మరోసారి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. చిరంజీవిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. అందుకే అత‌ను మెగాస్టార్ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : The Family Man 3: త్వరలో సెట్స్ పైకి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’

Chiranjeevikcr
Comments (0)
Add Comment