Chiranjeevi : సుదీర్ఘ కాలం పాటు విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన చంద్రమోహన్ అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 175 సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. మొత్తం 938 సినిమాలకు పైగా నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రమోహన్ కు అజాత శత్రువు అని పేరుంది. ఎవరు కలిసినా ప్రేమగా పలకరించే వారని గుర్తింపు ఉంది.
Chiranjeevi Comment
ఆయన మృతితో తీరని విషాదం అలుముకుందని పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ. వైవిధ్య భరితమైన పాత్రలలో నటించి ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్.
ఇదిలా ఉండగా ఆయన భార్య రచయిత్రి. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరూ అమెరికాలో ఉండడంతో ఇవాళ చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు. మా అసోసియేషన్ కూడా సంతాపం వ్యక్తం చేసింది.
Also Read : Chandra Mohan : హీరోయిన్స్ కు లక్కీ హీరో