Chiranjeevi-Olympics : ఒలింపిక్స్ విజేతలను అభినందించిన మెగాస్టార్

ఈ క్రీడలను వీక్షించేందుకు పలువురు సినీ తారలు సందర్శకులతో పాటు చిరంజీవి కుటుంబం కూడా వెళ్లిన విషయం తెలిసిందే...

Chiranjeevi : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ గేమ్స్‌ పారిస్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పాల్గొని విజయం సాధించిన క్రీడా విజేతలందరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తూ పోస్ట్‌ చేశారు. ‘‘ షూటింగ్‌ స్ట్టార్స్‌ సరబ్‌జ్యోత్‌ సింగ్‌, మను బాకర్‌, స్వప్నిల్‌, ఇండియా హాకీ టీమ్‌, హాకీ ఆటగాడు శ్రీజేశ్‌, జావెలిన్‌ ఛాంపియన్‌ నీరజ్‌చోప్రా, స్టార్‌ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ సహా, ఒలింపిక్స్‌లో బాగమైన 117 మంది క్రీడాకారులకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా వినేశ్‌ ఫొగాట్‌ నీవు నిజమైన పోరాట యోధురాలివి’’ అంటూ అందరికి ఎక్స్‌ వేదికగా తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు చిరంజీవి(Chiranjeevi). ఈ క్రీడలను వీక్షించేందుకు పలువురు సినీ తారలు సందర్శకులతో పాటు చిరంజీవి కుటుంబం కూడా వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్‌ నగరంలో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను చిరంజీవి, కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యాయి.

Chiranjeevi-Olympics..

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఇంపార్టన్స్ ఉంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కీలక సన్నివేశాలు తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు.

Also Read : Amigo Movie : దేశంలోనే మొట్టమొదటి సైబర్ ఫాంటసీ థ్రిల్లర్

ChiranjeeviSummer Olympics 2024TrendingUpdatesViral
Comments (0)
Add Comment