Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వయనాడ్ బాధితుల సహాయార్ధం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి(Chiranjeevi) – రామ్‌చరణ్ సంయుక్తంగా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. మృతులు, బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.
Chiranjeevi-Charan Helps
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే ఎంతోమంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు, నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు, మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
మోహన్ లాల్ – రూ.3 కోట్లు
చిరంజీవి, రామ్ చరణ్ 1 కోటి
అల్లు అర్జున్ – 25 లక్షలు
సూర్య, జ్యోతిక దంపతులు – రూ.50 లక్షలు
మమ్ముట్టి-దుల్కర్ – రూ.40 లక్షలు
కమల్ హాసన్ – రూ.25 లక్షలు
ఫహాద్ ఫాజిల్ – రూ.25 లక్షలు
విక్రమ్ – రూ.20 లక్షలు
రష్మిక – రూ.10 లక్షలు
సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ – 5లక్షలు
Also Read : Indian 2 OTT : ఆ ఓటీటీలో రానున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా