Chiranjeevi-Srikanth Odela : శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మంచి వింటేజ్ కమ్ బ్యాక్ ఇస్తున్న చిరు

సీనియర్‌ హీరో, యువ దర్శకుల కాంబినేషన్‌ ఇప్పుడు సూపర్‌హిట్‌ ఫార్ములా...

Chiranjeevi : గత రెండు రోజులుగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని సమర్పించడం విశేషం. అతడు వైలెన్స్ లో తన శాంతిని వెతుకున్నాడు అంటూ రక్తంలో తడిసిన చిరు చేతిని రెడ్ కలర్ ఇంటెన్స్ పోస్టర్‌తో రిలీజ్ చేశారు. దీంతో సినీ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇది వింటేజ్ చిరు అసలైన కంబ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Chiranjeevi New Movie With Srikanth Odela..

సీనియర్‌ హీరో, యువ దర్శకుల కాంబినేషన్‌ ఇప్పుడు సూపర్‌హిట్‌ ఫార్ములా. ఇలా వచ్చిన చిత్రాలు అన్ని భాషల్లోను ప్రభావం చూపుతున్నాయి. చిన్నప్పటి నుంచి తమ సినిమాల్ని చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్ర తారలకి బాగా నచ్చేస్తున్నాయి. దాంతో వాళ్ల అనుభవంతో సంబంధం లేకుండా కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. తమ అభిమాన హీరోను తెరపై ఎలా చూపించాలనుకుంటున్నారో అలా చూపించి మంచి రిజల్ట్‌ రాబడుతున్నారు. ఈ కాంబినేషన్‌ కూడా అలాంటి సినిమానే కానుందని అందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల ‘దసరా’ విడుదల తర్వాత తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు. రెండో సినిమాగానే చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల మరోసారి నానితో కలిసి ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల కలిసి సినిమా చేయనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read : Malaiyil Nanaigiren Movie : ‘పుష్ప 2’ కు పోటీగా తలైవా సపోర్ట్ తో కోలీవుడ్ ప్రేమకథా చిత్రం

Megastar ChiranjeeviMoviesSrikanth OdelaTrendingUpdatesViral
Comments (0)
Add Comment