Hero Chiranjeevi : హిచ్ కాక్ నాకు ఇన్సిపిరేష‌న్

పుస్త‌కంగా రావ‌డం ప్ర‌శంస‌నీయం

Chiranjeevi : సినిమా రంగానికి చెందిన ఎవ‌రైనా స‌రే రాణించాల‌న్నా , దాని లోతు పాతులు తెలుసు కోవాల‌ని అనుకుంటే త‌ప్ప‌నిస‌రిగా ముందుగా చ‌ద‌వాల్సింది , తెలుసు కోవాల్సింది హిచ్ కాక్. త‌న‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేశారంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). చిత్ర సీమ‌లోకి రావ‌డానికి దోహ‌దం చేసింద‌న్నారు.

Chiranjeevi Comment

ఈ సంద‌ర్బంగా హిచ్ కాక్ గురించి తెలుగులో ల‌భ్యం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ఇలాంటి గొప్ప వ్య‌క్తుల గురించి ఇంకా పుస్త‌కాలు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మెగాస్టార్. ప్ర‌పంచ సినిమా రంగంపై కీల‌క‌మైన ముద్ర పోషించిన ద‌ర్శ‌కుల‌లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఒక‌రు. త‌నే టాప్. వేలాది మందిని ఇప్ప‌టికీ ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్నారు.

ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లకు త‌ను స్పూర్తిగా ఉంటూ వ‌స్తున్నార‌ని చిరంజీవి పేర్కొన్నారు. హిచ్ కాక్ 125వ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న తీసిన సినిమా విడుద‌లై 100 ఏళ్లు పూర్త‌యినందు వ‌ల్ల హిచ్ కాక్ జీవితంపై మాస్ట‌ర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్ పుస్త‌కాన్ని సినీ ర‌చ‌యిత పుల‌గం చ‌న్నారాయ‌ణ‌, ఐఆర్టీసీ ఆఫీస‌ర్ ర‌వి పాడితో క‌లిసి పుస్త‌కాన్ని తీసుకు వ‌చ్చింది. 5 రోజుల్లో ఈపుస్త‌కం కాపీల‌న్నీ అమ్ముడు పోయాయి. తిరిగి రెండో ఎడిష‌న్ తీసుకు వ‌చ్చారు. ఈ పుస్త‌కాన్ని మెగాస్టార్ ఆవిష్క‌రించారు. ర‌చ‌యిత‌ల‌ను అభినందించారు.

Also Read : Victory Venkatesh Movie OTT :మార్చి 1న జీ తెలుగులో ‘వెంకీ’ మూవీ

CommentsMega Star ChiranjeeviViral
Comments (0)
Add Comment