Chinmayi Sripada : మార్ఫింగ్ పై చిన్మ‌యి ఆందోళ‌న

ర‌ష్మిక మంద‌న్నా..క‌త్రీనా కైఫ్ కు స‌పోర్ట్

Chinmayi Sripada : సినీ రంగానికి సంబంధించి ఈ మ‌ధ్య‌న మార్పింగ్, డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి. ఏఐ టెక్నాల‌జీ దెబ్బ‌కు పేరు పొందిన సినీ న‌టులు బ‌ల‌వుతున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే వ‌ణికి పోతున్నారు. గ‌తంలో సిమ్రాన్, త్రిష వీటి బారిన ప‌డ్డారు. ఆ త‌ర్వాత తాజాగా శాండివుల్ కు చెందిన ర‌ష్మిక మంద‌న్నా షాక్ కు గురైంది.

Chinmayi Sripada Comment

ఆ వెంట‌నే తేరుకుని నెట్టింట్లో వైర‌ల్ గా మారిన త‌న ఫోటోలు, వీడియోలు త‌న‌వి కావ‌ని స్ప‌ష్టం చేసింది. హుటా హుటిన పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది. ఎవ‌రు చేశారో త‌న‌కు తెలియాల‌ని, వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

ఇదిలా ఉండ‌గానే టైగ‌ర్ 3 మూవీతో స‌ల్మాన్ ఖాన్ తో న‌టిస్తున్న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి క‌త్రీనా కైఫ్ కూడా సేమ్ ఇలాగే బ‌లైంది. త‌ను ట‌వ‌ల్ క‌ట్టుకుని చేసిన ఫైట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీనిని మ‌రింత బోల్డ్ గా ఉండేలా ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఒక్క‌సారిగా ర‌ష్మిక మంద‌న్నాతో పాటు క‌త్రీనా కైఫ్ షాక్ కు గుర‌య్యారు.

ఇటు ర‌ష్మిక అటు క‌త్రీనాకు దేశ వ్యాప్తంగా ఆయా సినిమా రంగాల‌కు చెందిన సినీ న‌టులు మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద(Chinmayi Sripada) స్పందించింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది.

Also Read : Yatra2 Movie First Look : ఆస‌క్తి రేపుతున్న యాత్ర‌2

Comments (0)
Add Comment