Chinmayi Sripada : మగవాళ్ళు శృంగారం చేయడంపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు

ఇలా అయితే వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే....

Chinmayi Sripada : చిన్మయి శ్రీపాద.. ఈ పేరు అంటేనే కొంతమందికి హడల్, మరికొందరికి కోపం, చిరాకు ఇంకొందరికి ప్రేమ, అభిమానం. ఈ అభిప్రాయాలన్ని కేవలం ఆమె కళ సృజనాత్మకత గురించి మాత్రమే కాదు. ఆమె తనకంటూ ఒక అభిప్రాయం, స్టాండ్, పర్సనాలీటీని క్రియేట్ చేసుకున్నాక చాలా మందికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బహిరంగంగాను, సోషల్ మీడియా ద్వారాను ఆమె సొసైటీలో మహిళలు పేస్ చేస్తున్న సమస్యలపై పోరాటం చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కి దిమ్మదిరిగిపోయే కౌంటర్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

Chinmayi Sripada Comment

2024 సంవత్సరం పూర్తికావడంతో చాలా సంస్థలు వాళ్ళ సేల్స్, అచీవ్ మెంట్స్ తదితర అంశాలని షేర్ చేశాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ హోమ్ డెలివరీ గ్రోసరీస్ సంస్థ బ్లింక్ ఇట్ సీఈఓ ఒక్క రోజులోనే తమ యాప్ ద్వారా లక్షకు పైగా కండోమ్స్ సేల్ చేసినట్లు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజెన్.. ఇలా అయితే వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే.. అంటూ ట్వీట్ చేశాడు. దీనికి చిన్మయి(Chinmayi Sripada) స్పందిస్తూ.. “మగాళ్లు పెళ్ళికి ముందు అమ్మాయిలతో శృంగారం చేయడం ఆపండి. మీ అన్నదమ్ముల్ని, ఫ్రెండ్స్ ని పెళ్లి అయ్యేదాకా అలాంటి పని చేయొద్దని చెప్పండి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, పలువురు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులపై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఎందరో మహిళలలకు ఆమె అండగా నిలుస్తూ పోరాటం చేస్తున్నారు.

Also Read : Upasana Singh : తనకు జరిగిన లైంగిక వేధింపులపై స్పందించిన నటి ‘ఉపాసన’

ChinmayiCommentsUpdatesViral
Comments (0)
Add Comment