Chhaava : బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఛావా. ఇది మరాఠా యోధుడి నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కించిన మూవీ. ఎవరూ ఊహించని రీతిలో హిందీలో గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదలైంది. ఆశించిన దానికంటే అత్యధిక వసూళ్లను సాధించింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఏకంగా ఛావా హిందీ మూవీ రూ. 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Chhaava Collections
తాజాగా ఛావా(Chhaava) తెలుగు వెర్షన్ ను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక్కడ కూడా ఛావా చిత్రాన్ని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు తెలుగు వారంతా. చరిత్ర ఒకరు చెరిపి వేసినంతా చెరిగి పోదని, అది యోధానుయోధులతో కూడుకుని ఉన్నదని, పోరాటాలు, యుద్దాలు, విరోచిత విన్యాసాలు, అంతకు మించిన త్యాగాలతో నిండి పోయి ఉందంటూ ప్రకటించారు. ఛావా తెలుగు చిత్రంలో డైలాగులు పేలాయి. థియేటర్లకు రప్పించేలా చేశాయి.
ఛావా తెలుగు చిత్రం రెండు రోజుల్లోనే రూ. 6.81 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మరికొన్ని రోజుల్లో రూ. 10 కోట్ల మార్క్ ను కూడా దాటేయనుందని టాక్. ఇక బుక్ మై షో ద్వారా 50 వేల టికెట్లు బుక్ కాగా ఇప్పటి వరకు 68 వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించిందని మూవీ మేకర్స్ వెల్లడించారు.
Also Read : Hero Aamir Khan : లగాన్ ఫెయిల్ అవుతుందనుకున్నా