Chhaava : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ ప్రేమికుల పండుగ రోజు 14న విడుదల చేశారు. ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో ఛావా(Chhaava) హిందీ వెర్షన్ సక్సెస్ కావడంతో తెలుగులో దానిని రిలీజ్ చేశారు.
Chhaava Movie Telugu Records
ఆనాటి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచేలా సినిమాను మల్చడంలో సక్సెస్ అయ్యాడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక శంభాజీ గా విక్కీ కౌశల్ ప్రదర్శించిన విన్యాసాలు, తన భార్య ఏసుబాయిగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన నటన కన్నీళ్లు తెప్పించేలా చేసింది. అంతే కాదు చాన్నాళ్ల తర్వాత ఛావా సినిమాను చూసిన వాళ్లు తట్టుకోలేక థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
శంభాజీ మహారాజ్ కథగా వచ్చిన ఈ మూవీ చరిత్రలో ఇప్పటి వరకూ చూడని కోణాలను ఆవిష్కరించిందనే కామెంట్స్ వచ్చాయి. అదే టైమ్ లో సినిమా కోసం కథలో అనేక మార్పులు చేసినట్టు, చారిత్రక వక్రీకరణలు ఉన్నట్టు దర్శకుడే ఒప్పుకున్నాడు. అయినా భారతీయుల్లోని భావోద్వేగాలను రగలించడంలో వెండితెర సాక్షిగా ఛావా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక తెలుగు వర్షెన్ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు. మంచి స్పందన లభించింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయని మూవీ మేకర్స్ వెల్లడించారు.
Also Read : Beauty Ananya Panday Praises :దీపికా పదుకొణేను చూసి ఎంతో నేర్చుకున్నా