Chhaava : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్ అసమానమైన ప్రతిభా నైపుణ్యం, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అద్భుత నటన కలిసి చిత్రానికి ప్రాణం పోయడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
Chhaava Movie Updates
ప్రధానంగా విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో లీనమై పోయాడు. పోరాట సన్నివేశాలు, విరోచిత గాథకు ప్రాణం పెట్టిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా చేసింది. దీంతో ఊహించని రీతిలో ఛావా ఆశించిన దానికంటే అత్యధికంగా వసూళ్ల వేట కొనసాగిస్తోంది.
ఛావా(Chhaava) చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు దర్శకుడు. తాజాగా బీటౌన్ సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం రూ. 200 కోట్లకు దగ్గరలో ఉంది. విడుదలైన అన్ని థియేటర్లలో ప్రేక్షకులతో నిండి పోతుండడం విశేషం.
చాలా మటుకు 30 నిమిషాల పాటు శంభాజీ మహారాజ్ పాత్ర ఏడిపించేలా చేయడంతో థియేటర్లలోనే కన్నీళ్లు పెడుతుండడం విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఛావా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో కచ్చితంగా రూ. 300 కోట్ల మార్క్ ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Prem Kumar- Hero Sethupathi :ఆ కథ విజయ్ సేతుపతి కోసం రాయలేదు